మైదాన హాకీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైదాన హాకీ అడబడుచున్న దృశ్యం

మైదాన హాకీ అనేది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడ, దీనిని స్త్రీపురుషులిరువురూ అడతారు. దీని అధికారిక పేరు కేవలం హాకీ మాత్రమే, భారతదేశంతో సహా పలు చోట్ల దీనిని హాకీ గానే వ్యవహరిస్తారు.[1][2] కానీ కొన్నిదేశాలలో [3] దీనిని అక్కడ ప్రసిద్ధిగాంచిన ఇతర రకములైన హాకీల నుండి గుర్తంచడానికి మైదాన హాకీగా వ్యవహరిస్తారు. అదే కారణం చేత వివిధ విజ్ఞానసర్వస్వములు కూడా దీనిని మైదాన హాకీగా వ్యవహరిస్తారు.

హాకీలో తరచుగా జరిగే చాలా గౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, వేసవి ఒలింపిక్స్, నాలుగేళ్ళకోసారి జరిగే ప్రపంచ కప్ హాకీ, వార్షికంగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, బాలల ప్రపంచ కప్ హాకీ.

1980 వరకూ జరిగిన ఐదు ప్రపంచ కప్పు హాకీలలో భారతదేశపు, పాకిస్థాన్ దేశపు జట్లు నాలుగు సార్లు విజయాన్ని కైవసం చేసుకున్నాయి. కానీ ఆ తరువాత గడ్డినుండి ఆశ్ట్రో టర్ఫుకు హాకీ మైదానాన్ని మార్చి నప్పుడు వేరే జట్లు ప్రాముఖ్యతలోకి వచ్చాయి. వాటిలో కొన్ని నెదెర్లాండ్సు, జెర్మనీ, ఆస్ట్రేలియా, స్పైను, అర్జంటినా, ఇంగ్లాండు, దక్షిణ కొరియా.

ఈ క్రీడను అంతర్జాతీయ హాకీ కూటమి (FIH) నియంత్రిస్తుంది. అందులో భాగంగా హాకీలోని నిబంధనలు కూడా వివరింపబడతాయి.

పలు దేశాలలో హాకీని క్లబ్ క్రీడగా తీర్చిదిద్దారు, కానీ వాటికి ఉండవలసినంత ఆదరణ లేక కొందరు మాత్రమే హాకీని వృత్తిగా చేసుకొనగలిగారు. ఇక ఉత్తర అమెరికా,, అర్జెంటినాలలో దీనిని ఎక్కువగా ఆడవారి క్రీడగా పరిగణిస్తారు.

చరిత్ర

[మార్చు]
మహిళల హాకీ, గడ్డిపై. 1970ల వరకూ ఆటలపోటీలలో గడ్డిమీదే ఆడబడిన హాకీ ఇప్పుడు కృత్రిమ మైదానాల మీద ఆడబడుతున్నది.

హాకీ లాంటి కఱ్ఱతో బంతిని కొట్టే ఆటలు అనాదిగా ఆడబడుతూనే ఉన్నాయి. ఆధునిక హాకీ మాత్రం ఇంగ్లాండులోని ప్రభుత్వ పాఠశాలలో మొదలైంది. మొదటి హాకీ సంఘము 1886లో స్ధాపింపబడింది. అంర్జాతీయంగా 1895లో ఆడబడినది (ఐర్లాండు3, వేల్సు 0). నిబంధనల board 1900లో స్థాపింపబడింది. ఒలింపిక్ క్రీడలలో 1908, 1920లో మరియి 1928 నుండి ప్రతి సారి ఆడబడుతున్నది.

భారతదేశానికి దీన్ని బ్రిటిష్‍వారు తీసుకువచ్చారు. మొదటి క్లబ్బు 1885 లో కోల్‍కతాలో ఏర్పడింది. తరువాతి పదేళ్ళలో బీటంన్ కప్పు మఱియు ఆఘా ఖాన్ కప్పు మొదలయ్యాయి. 1928లో భారతదేశం ఒలింపిక్ క్రీడలలో వారు ఆడిన ఐదు ఆటలు ప్రత్యర్థికి ఒక్క లక్ష్యం కూడా ఇవ్వకుండా నెగ్గి బంగారు పథకాన్ని గెలుచుకుంది. అప్పటినుండి 1956 వరకు ప్రతి సారి భారత్ కే స్వర్ణం దక్కింది. 1964 మఱియు 1980 లలో కూడా భారత్ దే స్వరణం. 1960, 1968 మఱియు 1984లలో పాకిస్తాన్ నెగ్గింది. 1970లలో కృత్రిమ మైదానాలను పోటీలలో ఉపయోగించడం మొదులు పెట్టారు. గడ్డి బదులుగా దీనిని వాడడం హాకీ క్రీడనే మార్చివేసింది. ఆట చాలా వేగవంతమైంది. కొత్త వ్యూహములు చోటు చేసుకున్నాయి, వాటికి అనుగుణంగా నిబంధనలు కూడా మార్చబడ్డాయి. దీనితో హాకీ పై భారత్ పాక్ ల ఆధిపత్యం క్షీణించింది. దీనికి కారణం కృత్రిమ మైదానాలను నిక్షిప్తించడం చాలా వెలతో కూడిన విషయమవడం. ధనిక దేశాలకు ఇది అడ్డానికి కాలేదు. పైగా భారత పాక్‌లలో, దీనిని గ్రామీణ ప్రాంతలలో ఎక్కువ ఆడుదురు.

మహిళలు కూడా ఇంగ్లాండులో 1880ల నుండే హాకీ అడినా, వారు కృత్రిమ మైదానాల రాకతో ఎక్కువగా ఆడడం మొదలు పెట్టారు. మహిళాహాకీ ఒలింపిక్ క్రీడలలో 1980 నుండి ప్రవేశ పెట్టడం జరిగింది.

ఆట మైదానము

[మార్చు]
హాకీ మైదాన ఉదాహరణ - సిడ్నీ ఒలింపిక్ ఉద్యానవనం లోని హాకీ మైదానం

జట్టుకు పదకొండు మంది ఆటగాళ్ళు(గత్తెలు), మైదానము 91.40 మీ × 55 మీ కొలతలున్న చతుర్భుజము. ఇఱుచివర్లన 2.14 మీ (7 అడుగుల) ఎత్తు మఱియు 3.66 మీ (12 అడుగుల) వెడల్పు ఉన్న లక్ష్యాలు ఉంటాయి. ఈ లక్ష్యానికి 14.63 మీ (16 గజాల) దూరంలో వృత్తాకారంలో shooting circle (లేదా D) ఉంటుంది. దీనికి 5మీ దూరంలో చుక్కలతో ఇంకో అరవృత్తం ఉండును. ఇక మైదానానికి అడ్డంగా లక్ష్యాలకి 22.90 మీ (25 గజాల) దూరంలో అడ్డరేఖలు ఉంటాయి. మైదానాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తూ ఒక రేఖ ఉంటుంది. "D" మధ్యలో పెనాల్టి స్పాట్ ఉంటుంది. ఇది లక్ష్యరేఖమధ్యాలకి 6.40 మీ (7 గజాలు) దూరంలో ఉంటుంది.

నేటి హాకీలో నీరు చల్లబడిన కృత్రిమ మైదానలు పోటిలకు వాడబడతాయి. వీటితో బంతి చాలా వేగంగా వెళుతుంది. ఇదే కారణం చేత కొన్నాళ్ళు మట్టి/ఇసుక కూడిన మైదానంపై హాకీ ఆడడం జరిగింది. ఐతే మట్టి కంటే నీరు కూడిన కృత్రిమ మైదనాలు ఆటగాండ్లకు (ఆటగత్తెలకు) సురక్షితం కాబట్టి అవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాతావరణానికి అనుగుణంగా ఉండడానికని నీరు తక్కువ వాడే వినూత్నమైన మైదానాలు తయారుజేయ కృషి చేస్తున్నారు.

నిబంధనలు

[మార్చు]
ఆట మైదానపు బొమ్మ

ఆటగాళ్ళు బంతిని కఱ్ఱ యొక్క (గుండ్రటి వెనక భాగం తప్ప) ఏ భాగము తోనైనా కొట్టవచ్చు. నునుపక్క ఎప్పుడూ కఱ్ఱ యొక్క ‘సహజ’ ప్రక్క ఉండును (కుడిచేతివాటం ఉన్నవారికి).; హాకీలో ఎడమ చేతి వాటపు కఱ్ఱలు ఉండవు.

స్థితులు

[మార్చు]

జట్టుకు పదకొండు మంది ఆటగాళ్ళుందురు. వీరికి తోడు బల్ల మీద కూర్చున్నవారు ఐదుగురి వరకూ లోనికి రావచ్చు. జట్టులో మొత్తం పదహారు మందికి స్ధానం ఉంటుంది. ఆటలో ఎన్ని మార్పిడిలైనా చేయవచ్చు కాని ‘పెనాల్టి కార్నర్’ అప్పుడు మార్పిడి చేయరాదు.

ఆటగాళ్ళకు నిబంధనల ప్రకారం నిర్ణీత చోట్లంటూ ఏమీ లేవు. గోల్‍కీపర్ (బంతిని లక్ష్యంలోనికి వెళ్ళకుండా ప్రయత్నించే వ్యక్తి) కూడా ఉండనవసరం లేదు. ఐనా ప్రతి జట్టు, ఆటవాళ్ళ ను, రక్షాపంక్తి, మధ్య పంక్తి, ఆక్రమణ పంక్తిగా విభజించడం జరుగుతుంది, ఎన్నో జట్టులు స్వీపర్ అనే ఒకతన్ని కూడా నియమిస్తాయి. ఆట జరగడానికి ఇంత మంది ఆటగాళ్ళు ఉండాలనే నిబంధనలు కూడా లేవు.

ప్రతి జట్టులో ఒక క్రీడాకారుడు/ణి గోల్‍కీపర్ గా నియమింపబడతారు. వారు తగిన హెల్మెట్, కాలు చేతులకు ఇతర రక్షిత కవచములు ధరింపవలెను. గోలుకీపరు తన శరీరంలోని మఱియు తన కవచములలో దేనితోనైనా బంతిని గోలు లోనికి పోకుండా అప వచ్చు. అలానే, బంతిని దేనితోనైనా తన్న లేద కొట్టవచ్చు. కానీ వారు అన్ని సమయములలోనూ ఒక హాకీ కఱ్ఱను ధరించవలెను. గోలుకీపరు D బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇతర ఆటవారికి వలె, కఱ్ఱతో మాత్రమే బంతిని తాకవలెను. పెనల్టీ స్ట్రోకు తీసుకొనేందుకు మాత్రమే గోల్‍కీపర్లు తమ 23మీ గీతను దాటి బయటకు రావడానికి అనుమతింపబడుదురు. అన్య వేళల అలా రావడం నిబంధనలకు విరుద్ధం.

మామూలు ఆట

[మార్చు]

నిబంధనలకోసం ఆటవారిని ఆక్రమికులు లేదా రక్షకులుగా పిలవడం జరుగుతుంది. బంతి తమ వద్ద ఉన్న వ్యక్తులను ఆక్రమికులు గానూ, బంతి తమ వద్దలేని వారిని రక్షకులుగా వ్యవహిరిస్తారు.

ప్రక్క రేఖ నుండి కొట్టుట

ప్రతి ఆటని ఇద్దరు అంపైరులు పర్యవేక్షిస్తారు. ఒకో అంపైరూ మైదానంలోని ఒకో భాగాన్ని పర్యవేక్షిస్తారు. వీరికి తోడుగా సాంకేతిక సిబ్బంది ఉంటారు. వారిలో భాగమే ఒ కాల నిర్దేశి మఱియు స్కోరు నిర్దేశి.

ఆట ముందు బొమ్మా బొఱుసులో నెగ్గిన జట్టు సారథి, వారు ఎటు వైపు ఆడతారు అనేది ఎంపిక చేసుకోవచ్చు, లేదా వారు మొదట బంతిని తీసుకొని, ఎటువైపు ఆడతారనే నిర్ణయాన్ని అవతలి జట్టుకు విడిచిపెట్టవచ్చు. ఆటను 35 నిముషాల రెండు సమాన భాగలుగా విభజిస్తారు. వీటి మధ్య ఐదు నిమిషాల విరామం ఉంటుంది. రెండు సగాల మొదట్లోనూ మఱియు ఎవరైనా గోలు చేసినప్పుడు ఆటను మైదాన నడి నుండి ప్రారంభింతురు. ఇలా ప్రారంభించినపుడు ఆటవారందరూ, తమ తమ రక్షణా సగంలో ఉండవలెను. గోలు చేసినతరువాత, అవతలి జట్టుకు బంతి ఇవ్వబడును.

బంతిని అవుతలి జట్టు నుండి తమ అధీనంలోకి రాబట్టు కోవడానికి ఎల్లప్పుడూ రక్షణ ఆటవారు ప్రయత్నిస్తుంటారు. అలా అవతలి జట్టు ఆక్రమికులని అడ్డు కొనునప్పుడు, బంతిని తాకక ముందు వ్యక్తిని తాకడం దండనీయం. బంతి తన వద్దనున్న ఆటవారు తమ శరీరముతో రక్షకులని త్రోయరాదు.

ఆటవాళ్ళు తమ కాలితో బంతిని తాకరాదు. అనుకోకుండా తాకినప్పుడు, అలా తాకుటవలన వారు లబ్ధి పొందకున్న వారిని శిక్షంచరు.

దండనీయ అడ్డుకోవడాలు మూడు విధాలుగా జరుగుతాయి, 1) రక్షకులు ఆక్రమికుని,. బంతికీ మధ్య, న్యాయబద్దమైన టాకిల్ చేయకుండా రావడం. 2) రక్షకులి కఱ్ఱ బంతిని తాకకుండా ఆక్రమికులి కఱ్ఱకి మాత్రమే తగలడం 3) ప్రత్యర్థులకీ బంతికీ, మధ్య వచ్చి వారిని బంతికి చేరుకోకుండా ఆపడం.

బంతి ప్రక్క హద్దల బయటకు వెళితే, బంతిని ఆఖరున తాకిన ఆటవారి ప్రత్యర్థ జట్టుకి ఇచ్చి వారిని ప్రక్క (హద్దు) రేఖ నుండి కొట్టనిత్తురు. రక్షక జట్టు బంతిని వెనుక రేఖ మీదగా బయటకు పంపితే, దాన్ని అవతలి జట్టుకిచ్చి ప్రక్క రేఖ యొక్క 15మీ దగ్గర నుండి కొట్టనిత్తురు.

కొన్ని పద్ధతులు

[మార్చు]

ఫ్రీ హిట్

[మార్చు]

'కొట్టదగ్గ వృత్తాల' బయట తప్పిదములు జరిగితే, ఫ్రీ హిట్ ఇవ్వబడును. అన్యయం జరిగిన జట్టు అప్పుడు బంతిని తమ ఇష్టము వచ్చిన దిశగా త్రోయలేద పంపించవచ్చు. కాని బంతిని గాలిలోనికి ఉద్దేశ పూర్వకంగా ఎత్తరాదు. ఎత్తిన అది కూడా తప్పిదముగ పరిగణించబడును. ఫ్రీ హిట్ అపుడు ప్రత్యర్థలు బంతికి కనీసం 5 మీ. దూరంలో ఉండాలి. బంతిని కొట్టబోవు ఆటవాని వద్ద తన తోటి జట్టు వారొకరైనా ఉంటే, ప్రత్యర్థలు కూడా ఆ 5 మీ. కన్నా దగ్గరగా రావచ్చు.

15 మీ. లలోపు ఆక్రమణ జట్టు తప్పిదము చేస్తే, రక్షణ జట్టుకు 15 మీ. దగ్గర నుండి ఫ్రీ హిట్ ఇవ్వబడుతుంది. అంటే వెనుక రేఖకు సమీపంగా ఫ్రీ హిట్‌లు ఇవ్వబడవు. అటులనే, ఆక్రమణ జట్టు వారు బంతిని వెనుక రేఖ బయటకు పంపిన, 15మీ ఫ్రీహిట్ రక్షణ జట్టుకు ఇవ్వబడుతుంది .ఆక్రమణ జట్టు వారు ఆక్రమించదలచిన అరవృత్తంలో తప్పిదము చేస్తే, రక్షణ జట్టుకి బంతి ఇచ్చి, అరవృత్తంలో ఎక్కడినుంచైనా ఫ్రీ హిట్ చేసుకునే వీలుని కల్పిస్తారు.

దూరపు మూల నుండి

[మార్చు]

'లాంగ్ కార్నర్' అనగా చతుర్భుజము యొక్క కోణమునకు 5 మీ. దూరములో ప్రక్క రేఖ నుండి ఆక్రమణ జట్టుకు బంతిని ఇష్టానుసారం కొట్టుకునే వీలు ఇవ్వడం. రక్షణ జట్టులో ఒకరు తాకిన బంతి వెనుక రేఖ దాటి బయటకు వెళితే ఇది ఇవ్వబడును.

దండనా మూల నుండి

[మార్చు]

'పెనాల్టి కార్నర్' ని ఆక్రమణ జట్టుకి బహుకరిస్తారు. ఇది జరగడానికి, రక్షణా జట్టు వారి ఆక్రమణ అరవృత్తంలో తప్పిదము చేసి ఉండాలి. అప్పుడప్పుడూ దీన్ని 23మీ రక్షణా సీమలో ఉన్నప్పుడు పెద్ద తప్పిదములు చేసినా ఇవ్వవచ్చు. అలానే దీనిని రక్షణా జట్టు కావాలని (15 మీ. ఫ్రీ హీట్ చెయ్యడానికి) బంతిని వెనుక రేఖ మీదగా బయటకు పంపడం చేస్తే ఇవ్వబడుతుంది. ఇది ఎక్కువగా బంతి రక్షణ జట్టు ఆటవారి కాలుకి తాకిన ఇవ్వబడడం జరుగుతుంది.

దస్త్రం:Shortcorner.jpeg
నలుగురు రక్షకులు మఱియు గోలుకీపరు పెనాల్టి కార్నర్ కోఱకు వేచియున్నారు.

పెనాల్టి కార్నర్లుకు సిద్ధమవడానికి నలుగురు రక్షకులు, గోలీ వెనుక రేఖ వెనుక నుంచోవాలి. సహజంగా వారు, గోలు డబ్బాలోనే నుంచుంటారు. మిగిలిన రక్షకులందరూ మధ్యరేఖ దగ్గరకు వెళ్ళినుంచోవాలి. ఆక్రమణ సిబ్బంది D కి బయట నుంచుంటారు. ఒక ఆక్రమణ వ్యక్తి మాత్రము, బంతితో పాటు గొలుకు 10మీ. దూరంలో వెనుక గీత వద్ద నుంచుందును. అమే బంతిని D బయట ఉన్న ఆటవాళ్ళకి అందిచగా వారు దానిని D లోనికి తెచ్చిన పిదప, గోలులోనికి పంపడానికి ప్రయత్నింతురు. ఆటవారి రక్షణ కోసం, మొదట కొట్టిన బంతి 460మిమి లకంటే ఎత్తు ఎగర రాదు.

గోలులోనికి పంపే మొదటి ప్రయత్నం మాత్రము తోపుడు, ఫ్లిక్ లేదా స్కూప్ అయ్యిఉండాలి. ఎక్కవగా ఇటువంటి సందర్భాలలో, బంతిని లాగి విసరడం ఎక్కువ జరుగుతుంది.

శిక్షార్థము కొట్టు అవకాశము

[మార్చు]

పెనాల్టి స్ట్రోకు దీనిని రక్షా ఆటవారిలో ఒకరు బంతిని గోలు లోనికి పోకుండా కావాలని అక్రమంగా ఆపప్రయత్నిస్తే, ఆక్రమణ జట్టుకు ఇవ్వబడుతుంది. దీనిని పెనాల్టి కార్నరప్పుడు రక్షకులు బంతి కంటే ముందే వెనుక రేఖను దాటడం పదే పదే చేసినా ఇవ్వబడును.

పెనాల్టి స్ట్రోకప్పుడు ఒక ఆక్రమణ ఆటవారు గోలికి ముఖా ముఖిగా నుంచుందురు. గోలీ గోలు రేఖ మీద కదలకుండా నించోవాలి. ఆక్రమణ ఆటవారు బంతితో సహా దానికి తాకగల దూరాన నుంచుందురు. అంపైరు ఈల వెయ్యగానే, అతను/ఆమె దాని గోలులోనికి, తొయ్యడం, లేదా ఎత్తి విసరడం చెయ్యవచ్చు. బంతిని గట్టిగా కొట్టుట, ముందుకు లాగుట నిషిద్దం. గోలి దానిని లోనికి పోకుండా ఆపవలెను. బంతి గోలు వైపు కొట్టి ఆక్రమణ వ్యక్తి వైదొలగవలెను. గోలు విజయవంతమైతే, మధ్యరేఖ నుండి, లేకుంటే 15మీ రేఖ నుండి రక్షణా జట్టుచే ప్రారంభింపబడును.

ప్రమాదకర ఆటలు, గాలిలో బంతి

[మార్చు]

బంతిని ప్రమాదకరంగా గాలిలోనికి లేపినచో, అది అవతలి జట్టుకు స్వేచ్ఛా కొట్టుడుకి ఇస్తారు. బంతిని ప్రమాదకరంగా లేపబడినదా లేదా అనేది, పూర్తగా అంపయరే నిర్ణయిస్తారు.

బంతిని ఇతర ఆటవారికి గాలిలో నుండి అందించడం మాత్రం చేయవచ్చు. దానికి ఆవలి జట్టు వారందరూ కనీసం 5మీ దూరంలో ఉండాలి.

గోలు చేయడానికి ప్రయత్నించు నపుడు బంతిని గాలిలోకి లేపడం చేయవచ్చు. కాని అలా చేసినపుడు అది ఎవరికీ ప్రమాదకరము కాకూడదు. సాధారణంగా ఆక్రమణ జట్టులో వ్యక్తి గోలు పై దాడి చేస్తున్నప్పుడే బంతిని గాలిలోనికి లేపవలెను.

కఱ్ఱని ప్రమాదకరంగా వాడడం కూడా ప్రమాదకరమైన ఆటగా పరిగణించబడుతుంది. ఆటవాళ్లు బంతిని తమ భుజములపై భాగమున కొట్టరాదు. గొలును కాపాడడానికి అటుల చేసిన సమయములలో, ముందు బంతిని నియంత్రించేట్టే కొట్టాలి/తాకాలి.

హెచ్చరికలు మఱియు తొలగింపులు

[మార్చు]

హాకీలో మూడు రకాల కార్డులు హెచ్చరికలు మఱియు తొలగింపులకు వాడబడును.

  • పచ్చ కార్డు హెచ్చరిక.
  • పసుపు కార్డు తాత్కాలిక తొలగింపు. సాధారణంగా ఐదు నిమిషాలు ఆటనుండి వైదొలగివసివుంటుంది.
  • ఎఱ్ఱ కార్డు సాస్వత తొలగింపు. అప్పుడప్పుడూ ఈ కార్డు వచ్చిన ఆటవారికి కొన్ని తుదిపరి ఆటలలో ఆడు అర్హత ఉండదు.

ఒకే ఆటవారికి ఒకే కార్డు పదే పదే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇచ్చిన ప్రతీ సారీ శిక్ష ఇంకా తీవ్రంగా ఉండవలెను. కానీ ఒక తప్పిదముకు కార్డు చూపించబడిన, మఱల అదే తప్పిదము చేసిన ఇంకా తీవ్రమైన కార్డు ఇవ్వవలెను.

స్కోరు

[మార్చు]

బంతిని తమ ఆక్రమిత అరవృత్తములోకి తెచ్చి గోలు లోనికి పంపుట జట్టు లక్ష్యము. ఆలా రెండు 35 నిమిషాల సగాల పిదప ఎక్కువ గోలులు చేసిన జట్టు విజేత. అప్పుడప్పుడూ ఆట సమయాన్ని తగ్గించడం జరుగుతుంది.

సమాన సంఖ్యలో గోలులు చేసినచో

[మార్చు]

ఇఱు ప్రక్కల ఒకే స్కోరు చేసిన, టోర్ని బట్టి విజేతను నిర్ణయించే ప్రక్రియ ఉంటుంది. చాలా సార్లు ఎఫ్.ఐ.హెచ్ టూర్నమెంటు రెగులేషన్స్ లో వున్నటుగా, 7.5 నిమిషాల రెండు సగాలుగల అధిక సమయం ఆట ఆడబడుతుంది. అధిక సమయంలో స్వర్ణ గోలు లేదు హఠాణ్మరణం అను పద్ధతులను పాటిస్తారు. ఈ పద్ధతిలో ఒక జట్టు స్కోరు చెయ్యగానే, ఆట ముగించి వారిని విజేతగా ప్రకటిస్తారు. స్వర్ణ గోలు పద్ధతిని పాటింటనపుడు, అధిక సమయం ఆఖరున కూడా గోలుల సంఖ్య సమానమైతే, విజేతను పెనాల్టి స్టోకులు ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.

స్థానిక నిబంధనలు

[మార్చు]

శృంఖల బట్టి కొన్ని నిబంధనలు మారుతుంటాయి. చిన్నారులు ఆడేటప్పుడు,, తీర్థాలలో సరదాకి ఆడేటప్పుడు, ఆట సమయాన్ని కుదించడం జరుగుతుంది. వివిధ దేశ హాకీ సంఘాలు వివిధ నిబంధనలు పాటించడం జరుగుతుంది.

ఉదాహరణకు భారతదేశంలో ఆడు ప్రిమియర్ హాకీ లీగ్లో ఆట నాలుగు పాదాలుగా సాగుతుంది. ఒక్కో పాదానికి 17:30 నిమిషాలు. ఆట మధ్యలో వ్యూహరచనార్థం టైమౌట్లు కూడా తీసుకోవచ్చు.

ఎత్తుగడలు

[మార్చు]

బంతిని మైదానము పై తరలించు విధానములు. డ్రిబుల్ - ఇందు క్రీడాకారిణి బంతిని కఱ్రతో నియంత్రిస్తూ, తోసుకుంటూ పరుగిడును. తోపు (పుష్)- ఇందు బంతిని ముంజెయ్యితో చెయ్యడం జరుగుతుంది. ఎత్తివిసరుట - (ఫ్లిక్ లేదా స్కూప్) ఇది తోపులా వుంటుంది, కానీ ఆఖరున బంతిని గాలిలోకి ఎత్తడం జరుగుతుంది. హిట్ - ఇందు కఱ్రని గాలిలోకి ఎత్తి బంతిని లాగి కొట్టడం జరుగుతుంది. కఱ్రని మరీ పైకెత్తి వూపి కొట్టన దానిని డ్రైవ్ అనడం కూడా జరుగుతుంది.

బంతిని అవతలి జట్టునుండి దక్కించుకోవడానిని టాకిల్ అంటారు. టాకిల్ చెయ్యడానికి కఱ్రని బంతి వెళ్ళు మార్గంలో పెట్టవలెను. టాకిల్ ని విజయవంతం చేయనుద్ధేశంతో కఱ్రని నేల మీద పూర్తిగా వల్చడం కూడా జరుగుతుంది. టాకిల్ కి లొంగకుండా తప్పించుకోవడానికి ఆటవారు, దానిని పైన వివరింపబడ్డ తరలింపు విధానాలలో ఒకటి ప్రయోగించి తమ జట్టులోని ఇతర సభ్యులకి అందింతురు.

బంతిని అందించడంలో సఫలత కోసం జట్టు సభ్యులు కొన్ని సంకేతాలు ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో కొన్ని, "through" or "straight" - బంతిని తిన్నగా ఇంకో ఆటవారికి అందించడానికి. "Flat" or "square" - ఇది మైదానానికి అడ్డంగా పక్కకి అందించడానికి ఉపయోగించే సంకేతం. "drop" - బంతిని వెనక్కి అందించుట.

ఈ మధ్య కాలంలో హాకీలో పెనాల్టి కార్నర్లు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇందుకు కారణం, అవి గోలు చెయ్యడానికి చాలా మంచి అవకాశాలు అవ్వడం. లాగి తొయ్యడం (డ్రాగ్ ఫ్లిక్) ఉపయోగించి పెనాల్టి కార్నర్లలో మంచి ఫలితాలు సాధింస్తున్నారు. జట్లు నిత్యం పెనాల్టి కార్నర్లు సంపాదించు ప్రయత్నాలు చేస్తుంటాయి.

కొన్ని ఆట తీరులు లాగి తొయ్యడం, కొట్టడం, గోలు వైపు మళ్లించడం వంటి ఎత్తగడలు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పెద్ద కిటుకులేం వాడకుండా, లక్షాన్ని ఛేదించడానికి తమకంటే మెఱుగైన అవకాశమున్న జట్టు సభ్యులకి బంతిని అందిస్తారు.

మంచి హాకీ, చాలా వేగంవంతమైనా, చాలా నైపుణ్యం అవసరమైన ఆట. ఆటవారు బంతిని వేగంగా కదుపుతూ, నియంత్రిస్తూ ముందుకు సాగుతూంటారు. బంతిని గట్టిగా కొట్టడం, క్షణికంలో పక్కవారికి అందించడం వంటివి కనిపిస్తుంటాయి. అన్ని వేగంగా బంతిని లక్ష్యంవైపు తీసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించు ప్రయాసలో భాగంగానే.

శరీరంతో ఇతర ఆటవారిని తాకడం, వారి దారి కడ్డుపడడం నిషిద్దం. కాని వేగవంతమైన ఆట కావడం వలన, ఆటవారు గుద్దుకోవడం తఱచూ జరుతుంటుంది. మంచి ఆటవాళ్ల చేత బంతి వున్నప్పుడు కను రెప్పపాటులో బంతిని అందించడం, లేదా లక్ష్యాన్ని ఛేదించడం జరుగుతుంటుంది.

వ్యూహములు

[మార్చు]

వ్యూహాలు ఆటకి ఒక పద్ధతినీ, రీతిని కల్పిస్తాయి. వీటివల్ల ఆటవారికి తమ తమ బాధ్యతలను తేలికగా అర్థం చేసుకునే వీలుంటుంది. అత్యుత్తమ జట్లు చాలా విన్నూత్నమైన వ్యూహాప్రయోగాలు చేసినా, యువ జట్లు మాత్రం ప్రసిధ్ధిపొందిన కొన్ని ఉత్తమ వ్యాహాలనుండి, ఒకదానిని ఎన్నకోవడం జరుగుతుంది. అటువంటి వ్యాహాలలో కొన్ని 4-3-3, 5-3-2, 4-4-2. (రక్షాపంక్తిలో ఆటవారి సంఖ్య - మైదానమధ్య ఆటవారి సంఖ్య - ఆక్రమణ పంక్తిలో ఆడువారి సంఖ్య)

ఫుడ్బాలు లాగ హాకీలో కూడా ఒక గోలీ, పది ఇతర ఆటవారు ఉండడం, మఱియు రెండు లక్ష్యచేధన ఉద్దేశంగా అడబడే ఆటలు కాబట్టి రెండిటా వ్యూహ రచనకు చాలా పోలికలు వుంటాయి. ఫుడ్బాలుకు భిన్నంగా హాకీలో ఆఫ్ సైడ్ నియమము లేదు. కాబట్టి ఒక ఆటవారు తమ గోలుకి చాలా దగ్గరగా నుంచుని తమకి బంతిని అందింప కోరగలరు. దీనికి ప్రత్నామ్యాయంగా రక్షణా సిబ్బందిలో ఒక ఆటవారు ఆక్రమణ పంక్తిలోని ఆటవారికి 'తోడు' గా వుంటారు. దీని మూలంగా 1-4-4-1 (5-4-1 యొక్క వ్యత్యయము) వంటి వ్యూహాల వాడుక కనబడుతుంది.

ప్రఖ్యాత అంతర్జాతీయ హాకీ పోటీలు

[మార్చు]

హాకీకి తరచూగా జరిగే చాలా గౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, నాలుగేళ్ళకోసారి జరిగే వేసవి ఒలింపిక్స్, నాలుగేళ్ళకోసారి జరిగే ప్రపంచ కప్ హాకీ, కుమారుల ప్రపంచ కప్ హాకీ, మఱియు వార్షికంగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రంపంచంలోని ఆఱు అత్యుత్తమ జట్ల మధ్య జరిగే పోటి. హాకీ ఉమ్మడి ధనం క్రీడలలో 1998 నుండి ప్రవేశ పెట్టారు. Commonwealth Games. పురుషలలో, భారత్ 8 ఒలింపిక్ స్వర్ణాలను, పాకిస్థాన్ 4 ప్రపంచ కప్పులను గెల్చుకున్నాయి. మహిళలలో ఆస్ట్రేలియా 3 ఒలింపిక స్వర్ణాలను గెలుచుకోగా; నెథర్లాండ్స్ ప్రపంచ కప్పును ఆఱు సార్లు కైవసం చేసుకుంది. వార్షికంగా మలేషియాలో జరిగే సుల్తన్ అజ్లన్ షా హాకీ పోటీ ఈ మధ్య ప్రఖ్యాతి గాంచుతుంది.

క్రీడాకారులు

[మార్చు]

విషయములు

[మార్చు]
  1. International Hockey Federation
  2. Official website of the Olympic movement
  3. American Samoa, Azerbaijan, Canada, Latvia, Moldova, Romania, U.S

బాహ్య లంకెలు

[మార్చు]